Search this site
Embedded Files
Vasthu House
  • Home
  • Consult Us
  • Blog Vasthu House
  • Blog_Chinthamani Gruham
    • Lalitha Sahasra Naamam
  • YouTube
  • Services
    • Vasthu Compliance Online!
    • Vasthu for New Home
    • Residential Vasthu
    • Vasthu for Office
    • Commercial Vasthu
    • Benefits of Industrial Vasthu
    • Online Vasthu Consultation
    • Astrology
    • Numerology
  • Why Choose Us
  • Contact Us
  • Smt. Karnati Vanitha
  • Interiors
  • Case Studies
  • Horoscope Report
  • Our Vasthu Experts
  • FAQ
  • T&C
Vasthu House
  • Home
  • Consult Us
  • Blog Vasthu House
  • Blog_Chinthamani Gruham
    • Lalitha Sahasra Naamam
  • YouTube
  • Services
    • Vasthu Compliance Online!
    • Vasthu for New Home
    • Residential Vasthu
    • Vasthu for Office
    • Commercial Vasthu
    • Benefits of Industrial Vasthu
    • Online Vasthu Consultation
    • Astrology
    • Numerology
  • Why Choose Us
  • Contact Us
  • Smt. Karnati Vanitha
  • Interiors
  • Case Studies
  • Horoscope Report
  • Our Vasthu Experts
  • FAQ
  • T&C
  • More
    • Home
    • Consult Us
    • Blog Vasthu House
    • Blog_Chinthamani Gruham
      • Lalitha Sahasra Naamam
    • YouTube
    • Services
      • Vasthu Compliance Online!
      • Vasthu for New Home
      • Residential Vasthu
      • Vasthu for Office
      • Commercial Vasthu
      • Benefits of Industrial Vasthu
      • Online Vasthu Consultation
      • Astrology
      • Numerology
    • Why Choose Us
    • Contact Us
    • Smt. Karnati Vanitha
    • Interiors
    • Case Studies
    • Horoscope Report
    • Our Vasthu Experts
    • FAQ
    • T&C

కార్తీకమాసం లో ప్రతి దినమూ పర్వదినమే!

- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత

కార్తీకమాసం అత్యంత పవిత్రమైన మాసం.

- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత

పౌర్ణమినాడు కృత్తికా నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. అటు హరికి, ఇటు హరుడికి, మరోపక్క వారిద్దరి తనయుడైన అయ్యప్పకి కూడా ప్రీతికరమైన మాసమిది. హరిహరులిద్దరూ పరస్పరం అభిమానించుకుంటారు, ఆరాధించుకుంటారు, పూజించుకుంటారు. హరిపూజ హరునికి ఇష్టమైతే, శివపూజ కేశవునికి ప్రీతికరం. తులసీ పూజలు, వన భోజనాలు, సమారధాలు, ఉపవాసమలు, అభిషేకాలు, సహస్రనామ పారాయణలతో మార్మోగుతూ ఆస్తిక భావానాలు కలుగజేసే మాసమిది. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, ఈ మాసంలో ముప్పై రోజులు పర్వదినాలే..!


● పాడ్యమి: కార్తీక శుద్ధ పాడ్యమి తెల్లవారుజాముననే లేచి స్నానం చేసి, అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయనికెళ్ళి, 'నేను చేయదలచిన కార్తీక వ్రతం నిర్విజ్ఞానంగా సాగేటట్లు అనుగ్రహింపు' మని ప్రార్దించి సంకల్పం చెప్పుకుని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి.


● విదియ: ఈరోజు సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి.


● తదియ: ఈనాడు పార్వతీదేవికి కుంకుమ పూజ చేయించుకుంటే స్త్రీలకు సౌభాగ్య సిద్ది కలుగుతుంది.


● చవితి: కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పుట్టలో పాలు పోయాలి.


● పంచమి: దీనినే జ్ఞాన పంచమి అని కూడా అంటారు. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రీత్యర్ధం అర్చనలు, అభిషేకాలు, చేయించుకున్నవారికి జ్ఞానవృద్ధి కలుగుతుంది.


● షష్టి: ఈ రోజు బ్రహ్మచారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాదులతో సహా ఎర్రగళ్ళ కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది.


● సప్తమి: ఈరోజు ఎర్రవస్త్రంలో గోదుమలు పోసి దానమివ్వడం వల్ల ఆయుష్షు వృద్ది అవుతుందని శాస్త్రోక్తి.


● అష్టమి: ఈ గోపాష్టమి నాడు చేసే "గోపూజ" విశేష ఫలితాలనిస్తుంది.


● నవమి: ఈ రోజు నుండి మూడురోజులపాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. నవమి నుండీ మొదలు పెట్టి రాత్రి విష్ణుపూజ చేయాలి.


● దశమి: నేడు విష్ణు సహస్రనామ పారాయణ చేసి, గుమ్మడికాయను, ఉసిరికాయను దానం చేయాలి.


● ఏకాదశి: ఈ ఏకాదశికే భోధనైకాదశి అని పేరు. ఈరోజు విష్ణుపూజ చేసిన వారికి ఉత్తమగతులు కలుగుతాయి.


● ద్వాదశి: ఇది క్షీరాబ్ది ద్వాదశి. సాయంకాలం వేళ తులసికోటలో ఉసిరి కొమ్మను ఉంచి తులసికీ, ఉసిరికీ కళ్యాణం చేయించటం సకల పాపాలని క్షీణింప జేస్తుందని ప్రతీతి.


● త్రయోదశి: ఈరోజు సాలగ్రామ దానం చేయటం వల్ల సకల కష్టాలు దూరమౌతాయని శాస్త్రోక్తి.


● చతుర్దశి: నేడు శనైశ్చర ప్రాత్యర్డం ఇనుము, నువ్వులు, పత్తి, మినుములు, మొదలైన వాటిని దానం చేయటం వల్ల శని సంతృప్తి చెంది శుభ దృష్టిని ప్రసాదిస్తాడు.


● పౌర్ణమి: కార్తీక పూర్ణిమ, మహాపవిత్రమైన ఈ శుభదినాన నదీస్నానం చేసి, శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల పాపాలన్నీ పటాపంచలౌతాయి.


● పాడ్యమి: (కార్తీక బహుళ పాడ్యమి) ఈరోజు ఆకుకూర దానం చేయడం శుభదాయకం.


● విదియ: వనభోజనం చేయటం విశేష ఫలాలనిస్తుంది.


● తదియ: పండితులకు, గురువులకు తులసీమాలను సమర్పించటం వల్ల తెలివితేటలు వృద్ది అవుతాయి.


● చవితి: పగలంతా ఉపవాసముండి, సాయంత్రం వేళ గణపతిని గారిక తో పూజ చేసి, ఆ గరికను తలగడ కింద పెట్టుకుని పడుకుటే దుస్వప్న దోషాలు పోయి సంపదలు కలుగుతాయి.


● పంచమి: ఈరోజు చీమలకు నూకలు చల్లటం, శునకాలకు అన్నం తినిపించటం శుభ ఫలితాలనిస్తుంది.


● షష్టి: గ్రామదేవతలకు పూజచేయటం వల్ల వారు సంతుష్టులై, ఏ విధమైన కీడు కలుగకుండా కాపాడుతారు.


● సప్తమి: జిల్లేడు పూలతో గుచ్చిన దండనీ ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ది చెందుతాయి.


● అష్టమి: కాలభైరవాష్టకం చదివి గారెలతో దండ చేసి, కాలభైరవానికి (కుక్కకు) సమర్పించటం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది.


● నవమి: వెండి లేదా రాగి కలశం లో నీరు పోసి పండితునికి/బ్రాహ్మణునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు.


● దశమి: నేడు అన్నసంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రులై, కోరికలు తీరుతాయని పురాణోక్తి.


● ఏకాదశి: వైష్ణవాలయంలో దీపారాదన చేసుకోవడం , పురాణ శ్రవణం, పఠనం, జాగరణ మున్నగునవి విశేష ఫలదాయకం.


● ద్వాదశి: అన్నదానం లేదా స్వయంపాకం సమర్పించటం శుభప్రదం.


● త్రయోదశి: నవగ్రహారాదన చేయటం వల్ల గ్రహదోషాలు తోలుగుతాయి.


● చతుర్దశి: ఈమాస శివరాత్రినాడు ఈశ్వరార్చన, అభిషేకం చేయటం వల్ల అపమృత్యు దోషాలు , గ్రహబాధలు తొలగి, పరిపూర్ణ ఆరోగ్యవంతులౌతారని పురాణోక్తి.


● అమావాస్య: ఈరోజు పితృదేవతల సంతృప్తి కొరకు ఎవరినైనా పిలచి వారికి భోజనం పెట్టాలి. లేదా పండితులకు, బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వాలి. పగలు ఉపవాసం ఉండటం మంచిది. శివకేశవ ప్రీత్యర్థం దీపారాదన చేసి, కొబ్బరికాయ కొట్టి నమస్కరించాలి.


★ ఉత్తమమైనది ఉత్థాన ఏకాదశి: ★


ఈ కార్తీకమాసం లో అత్యంత విశేషమైనది ఉత్థానఏకాదశి. శ్రీమహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషునిపాన్పుపైన ఆషాడ శుద్ధఏకాదశి నాడు యోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశినాడు మేల్కొన్న రోజుకే 'ఉత్థాన ఏకాదశి' అని పేరు.


★ విశిష్ట ఫలప్రదం తులసీ కల్యాణం: ★


క్షీరాబ్ది ద్వాదశి నాడు ముప్పైరెండు మంది దేవతలలో శ్రీమహాలక్ష్మీ సమేతుడై స్వామీ తులసీ ధాత్రి వనంలో ఉంటాడని చెప్తారు. పూర్వం కృతయుగంలో దేవదానవులు క్షీరసాగరమధనం చేసిన రోజు కనుక దీనికి క్షీరాబ్దిద్వాదశి అని పేరు వచ్చింది. పాల సముద్రాన్ని చిలికిన కారణంగా 'చిల్కు ద్వాదశి' అనికూడా పిలుస్తారు. స్త్రీలు ఈరోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీ ధాత్రి (తులసికోట) దగ్గర విశేష దీపారాదనలు చేసి షోడశోపచారాలతో తులసీ కళ్యాణం జరిపి, లక్ష్మీనారాయణులను పూజిస్తారు.


★ సోమవారానికి ప్రాధాన్యత: ★


కార్తికంలో సోమవారానికి ఎనలేని ప్రాధాన్యతఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్నినక్షత్రాలలో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు పూరుడై ఈ నక్షత్రంమీద ఉండటం చేత సోమవారాలకు విశిష్టత కలిగింది. సోమ అంటే చంద్రుడు. శివుని సిగలో వెలిగే చంద్రుని వారం గనుకే సోమవార ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత. అదీగాక సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే భక్తులు ఈ మాసంలో సోమవారాలలో భక్తిశ్రద్ధలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ‘హరహరశంభో’ అంటూ శివుణ్ణి స్తుతిస్తూ భక్తి సాగరంలో ఓలలాడతారు. సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించడం వల్ల సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో, ఆనందోత్సాహాలతో వర్థిల్లుతారని విశ్వాసం.


|| ఓం శ్రీమాత్రేనమః ||

- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత

Visit Vasthu House#2-277/1/4/A/1, Opp HSR Sarala Devi Enclave, Meerpet Municipality, Balapur (M), Hyderabad, Telangana 500097. +91 9949588017.
LinkLinkFacebookLinkInstagramLinkLinkLinkLinkLink
Google Sites
Report abuse
Page details
Page updated
Google Sites
Report abuse